Surat Murder Cae | సూరత్‌లో దారుణం.. భార్యను హత్య చేసి శవాన్ని సిమెంట్‌తో కప్పి దాచిన భర్త

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Surat Murder Cae | గుజరాత్ రాష్ట్రం (Gujarat State)లోని సూరత్ నగరంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని పాడుబడిన ఇంట్లోని ఒక చెక్క పెట్టెలో దాచిపెట్టి, దానిపై సిమెంట్ పోసి కప్పి ఉంచిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితుడైన భర్త ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే, విశాల్ సాళ్వే (40) అనే వ్యక్తి తన భార్య శిల్పా సాళ్వే (39) గత నాలుగు రోజులుగా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వృత్తిరీత్యా డైటీషియన్ అయిన శిల్ప అదృశ్యంపై పోలీసులు మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే, ఈ కేసు త్వరలోనే అనూహ్య మలుపు తిరిగింది.

Surat Murder Cae | మిస్సింగ్ నుంచి హత్య కేసుగా ..

ఈ కేసులో కీలకంగా మారింది ఒక లేఖ. విశాల్ , శిల్పల మైనర్ కుమారుడికి ఇంట్లో ఒక నోట్ దొరికింది. అందులో విశాల్ తాను ఒక పెద్ద తప్పు చేశానని, శిల్ప ఇక లేడని పేర్కొన్నాడు. ఆ బాలుడు వెంటనే ఆ లేఖను పోలీసులకు అందించడంతో కేసు మిస్సింగ్ నుంచి హత్య కేసుగా మారింది. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, నిందితుడికి సంబంధించిన సలాబత్‌పురా (Salabatpura) ప్రాంతంలోని ఒక పాడుబడిన ఇంటిని గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా, భయంకరమైన దుర్వాసన వారిని కలచివేసింది. గదిలోని మూలలో ఉన్న చెక్క పెట్టెను తెరిచి చూడగా, అందులో శిల్ప మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది.

Surat Murder Cae

Surat Murder Cae | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే

శవం నుంచి దుర్వాసన బయటకు రాకుండా ఉండేందుకు నిందితుడు దానిపై పచ్చి సిమెంట్ పోసి కప్పి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి 4-5 రోజుల ముందే ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు సమాచారం. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే విశాల్ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా, సీసీటీవీ ఫుటేజ్ మరియు ఇతర ఆధారాల ఆధారంగా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటన సూరత్ (Surat) నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టంచేసింది.

ఇది కూడా చదవండి..: Himalayan Snow Decline | నీటి గోపురాల్లో తగ్గుతున్న మంచు.. హిమాలయాలు కనుమరుగుకానున్నాయా!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *