Railway Engineer Bribe | రూ.15 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన రైల్వే ఇంజినీర్​

విజయవాడలో ఓ రైల్వే ఇంజినీర్​ రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Engineer Bribe | ఓ వైపు దేశంలో ఎంతో మంది యువకులు నెలకు రూ.15 వేలు సంపాదించడానికి అనేక తిప్పలు పడుతున్నారు. రోజు 8 గంటలు పని చేస్తున్నారు. అవినీతి అధికారులు మాత్రం ఒక్కో పనికి లక్షల రూపాలయ లంచాలు తీసుకుంటున్నారు. తాజాగా రూ.15 లక్షల లంచం తీసుకుంటున్న భారీ అవినీతి తిమింగలాన్ని సీబీఐ (CBI) అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

విజయవాడ దక్షిణ మధ్య (SC) రైల్వే ప్రాజెక్టుల చీఫ్ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్ కార్యాలయానికి చెందిన సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌ను సీబీఐ అధికారులు ఆదివారం అరెస్ట్​ చేశారు. లంచం డిమాండ్ చేయడం, స్వీకరించడం వంటి ఆరోపణలపై, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, నలుగురు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Railway Engineer Bribe | బోనస్​ క్లెయిమ్​ కోసం..

దక్షిణ మధ్య రైల్వే ద్వారా రూ. 179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (Signaling) పనిని పొందిన రెండు ప్రైవేట్ కంపెనీలు జాయింట్ వెంచర్ పనిని గడువుకు ముందే పూర్తి చేశామని సుమారు రూ. 7 కోట్ల బోనస్‌ను క్లెయిమ్ చేశాయి. జాయింట్ వెంచర్‌కు అనవసరమైన సహాయం అందించడానికి, బోనస్ క్లెయిమ్‌కు ఆమోదం తెలపడానికి విజయవాడలోని రైల్వే అధికారులు లంచం డిమాండ్​ చేశారు. బోనస్​ కోసం ఆ ఫైల్‌కు సంబంధించిన తేదీలను అధికారులు తారుమారు చేశారు. ప్రైవేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కుమారుడు, నిందితుడైన సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌కు ఆదివారం రూ.15 లక్షల లంచం అందించాడు. ఆ సమయంలో అధికారులు వల పన్ని అతడిని అరెస్ట్ చేశారు.

Railway Engineer Bribe | ఇళ్లలో సోదాలు

విశాఖపట్నం, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్‌లోని నిందితుల నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. నిందితులైన సీనియర్ సెక్షన్ ఇంజనీర్, ఒక ప్రైవేట్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వారిని సోమవారం కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు. కాగా సదరు అధికారి గతంలో ఎంత మొత్తం లంచాలు తీసుకున్నాడోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

దీనిని కూడా చదవండి  : LPG Production Targets | ఎల్‌పీజీ ఉత్పత్తిపై కేంద్రం కీలక నిర్ణయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *