అక్షర టుడే, నందిపేట్: Kalyana Lakshmi Scheme | కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయకుండా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, ఆర్మూర్ Armoor నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచనతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయాలన్న ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Kalyana Lakshmi Scheme | మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు..
ఈ సందర్భంగా నందిపేట్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Kalyana Lakshmi Scheme | బడుగు బలహీన వర్గాలకు అన్యాయం
ఈ పథకం రద్దు చేస్తే బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఎంతోమంది ఆడబిడ్డలు, వారి కుటుంబాలు నష్టపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు.
ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
అనంతరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి నందిపేట్ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.