అక్షరటుడే, వెబ్‌డెస్క్: Death Penalty in India | ఉరిశిక్షపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఉరిశిక్షకు బదులుగా విషపు ఇంజెక్షన్ వంటి తక్కువ బాధ కలిగించే ఇతర పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది.
ఉరిశిక్ష రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ, దేశంలో ప్రస్తుతానికి ఉరిశిక్ష అమలు పద్ధతిగానే కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి తక్కువ నొప్పి కలిగించే, వారి గౌరవాన్ని కాపాడే విధంగా మరణశిక్షను అమలు చేయడానికి, ఉరిశిక్షకు బదులుగా ఒక ప్రత్యామ్నాయ పద్ధతిని అవలంబించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు తీర్పులను విస్తృత ధర్మాసనానికి నివేదించాలని పిటిషనర్ కోరారు. అలా చేయడానికి తగిన ఆధారం లేదని ధర్మాసనం పేర్కొంది.
Death Penalty in India | 5 నిమిషాల్లో..
ఉరిశిక్షకు ప్రత్యామ్నాయంగా విషపు ఇంజెక్షన్, కాల్చివేత, విద్యుదాఘాతం గ్యాస్ ఛాంబర్ వంటి పద్ధతులను వినియోగించాలని న్యాయవాది రిషి మల్హోత్రా పిటిషన్లో కోరారు. ఉరితీసిన తర్వాత మరణాన్ని ప్రకటించడానికి దాదాపు 40 నిమిషాలు పడుతుందని, అయితే కాల్పులు లేదా ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా ఈ ప్రక్రియ సుమారు 5 నిమిషాల్లో పూర్తవుతుందని పేర్కొన్నారు. మరణశిక్ష విధించినప్పుడు, సాధ్యమైనంత తక్కువ బాధను కలిగించే పద్ధతిలో దానిని అమలు చేయాలని పేర్కొన్న ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని కూడా మల్హోత్రా పిటిషన్లో పొందుపరిచారు. ఈ విషయంపై తమ తీర్పు అంతిమమైనది కాదని, మరణశిక్ష అమలుకు ప్రత్యామ్నాయ పద్ధతులపై బలమైన శాస్త్రీయ ఆధారాలు లభిస్తే భవిష్యత్తులో ఈ అంశాన్ని మళ్లీ పరిశీలించవచ్చని కోర్టు పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Maharashtra FDA | మహారాష్ట్రకు ఎఫ్‌డీఏకు షాక్.. రూ.5 లక్షల జరిమానా