నిజామాబాద్11KV Power Line Danger | 11/33 కేవీ విద్యుత్ లైన్ మార్చకపోతే ప్రాణ నష్టమే..

11KV Power Line Danger | 11/33 కేవీ విద్యుత్ లైన్ మార్చకపోతే ప్రాణ నష్టమే..

పెద్దకొడప్​గల్​లోని నూతన ప్లాట్లలో ఉన్న 11/33 కేవీ విద్యుత్ లైన్​ను మార్చాలని బీజేపీ నాయకుడు తానాజీ రావు కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

అక్షరటుడే, పెద్ద కొడప్​గల్ : 11KV Power Line Danger | పెద్దకొడప్​గల్​ మండల కేంద్రంలోని నూతన ప్లాట్లలో గల 11/33 కేవీ విద్యుత్ లైన్​ను మార్చి కాలనీవాసుల ప్రాణాలు కాపాడాలని బీజేపీ మండల నాయకుడు తానాజీ రావు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఉన్న ఈ హెవీ విద్యుత్​ లైన్​ సుమారు పది ఇళ్ల పైనుంచి వెళ్తోందన్నారు. ఇప్పటికే ఆర్నెళ్లలో మూడుచోట్ల లైన్​ తెగిపోయి ఇబ్బందులు పడ్డామన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

11KV Power Line Danger | ఆర్నెళ్ల క్రితం..

ఆర్నెళ్ల క్రితం విద్యుత్ లైన్ తెగిన రోజు మండల కేంద్రంలో ప్రజలు రోడ్డుపై ధర్నా చేయగా విద్యుత్ శాఖ అధికారులు (Electricity Department Officers) సంఘటనా స్థలానికి చేరుకొని త్వరలోనే విద్యుత్​లైన్​ మారుస్తామని మాట ఇచ్చారన్నారు. అప్పుడు ధర్నా విరమించామని.. కానీ ఇప్పటివరకు కూడా సమస్య పరిష్కారం కాలేదన్నారు. సంఘటన జరిగి ప్రాణాలు కోల్పోతే తప్పా విద్యుత్​ అధికారులు స్పందించే అవకాశం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు. మరో ఇంటిపై విద్యుత్ లైన్ తెగే అవకాశం ఉండడంతో ఈనెల 18న కాలనీవాసులు స్థానిక విద్యుత్ అధికారులకు తెలియజేయడంతో మరమ్మతులు చేశారన్నారు. మరో నెల రోజులు అయితే వర్షాకాలం వస్తుందని.. బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో.. సమస్య తీవ్రం కాకముందే వెంటనే లైన్​ను మార్చాలని వారు డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Fee Reimbursement | రీయింబర్స్​మెంట్​ బకాయిలను వెంటనే విడుదల చేయాలి..

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...