అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dowry Murder Case | కట్నం కింద గేదె, మోటార్‌సైకిల్ ఇవ్వాలని ఓ వ్యక్తి తన భార్యను వేధించాడు. అంతేగాకుండా ఆమెను హత్య చేశాడు. ఈ కేసులో కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది.
బీహార్ (Bihar)కు చెందిన రీనా దేవిని ఆమె భర్త సుభాష్ యాదవ్ హత్య చేశారు. కట్నం కింద గేదె, బైక్ ఇవ్వకపోవడంతో అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడు ఆమె మృతదేహాన్ని కాల్చి, మూడు ముక్కలుగా నరికి, వేర్వేరు సంచులలో పారవేశాడు. రీనా తల్లి మంజు దేవి ఫిర్యాదు మేరకు, ధనహా పోలీసులు 2020 జూలై 30న కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేప్టటిన పశ్చిమ చంపారన్ జిల్లా కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది. అదే సమయంలో, తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన ఆ దంపతుల ఇద్దరు మైనర్ పిల్లలకు ఆర్థిక భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంది.
Dowry Murder Case | రూ.లక్ష జరిమానా..
కట్నంగా మోటార్‌సైకిల్, గేదె ఇవ్వాలన్న డిమాండ్ చుట్టూనే ఆ దంపతుల మధ్య వివాదాలు నడిచాయని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా, తన భార్యను హత్య చేసిన నేరంలో సుభాష్ యాదవ్ దోషి అని కోర్టు నిర్ధారించింది. జీవిత ఖైదుతో పాటు రూ. లక్ష జరిమానా కూడా విధించింది. తల్లి మరణించడం, తండ్రికి జీవిత ఖైదు పడటంతో, ఆ పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణకు దూరమయ్యారు. ఆ పిల్లలిద్దరి పెంపకానికి తోడ్పడేలా నెలకు ఒక్కొక్కరికి రూ. 4,000 చొప్పున అందించాలని బీహార్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
ఇది కూడా చదవండి..: Vijay MLA Benefits | ఎమ్మెల్యేలకు ఉచితంగా కార్లు.. సీఎం విజయ్ కీలక నిర్ణయం