అక్షరటుడే, వెబ్డెస్క్: Raja Singh BJP Criticism | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర నేతలపై విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీ నాయకులు గ్రూప్ రాజకీయాలు చేయడంతోనే జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదన్నారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు.
బీజేపీ జాతీయ నాయకత్వం ఇటీవల నూతన జాతీయ కార్యవర్గాన్ని నియమించిన విషయం తెలిసిందే. 13 మంది ఉపాధ్యక్షులతో పాటు పలు పదవులను భర్తీ చేసింది. ఇందులో ఏపీ నుంచి పురుందరేశ్వరీకి ఉపాధ్యక్ష పదవి దక్కింది. అయితే తెలంగాణలో అధికారంలోకి రావాలని అనుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులకు మాత్రం జాతీయ కార్యవర్గంలో అవకాశం ఇవ్వలేదు. దీనిపై బీజేపీ మాజీ నేత రాజాసింగ్ స్పందించారు.
Raja Singh BJP Criticism | నిరంతరం ఫిర్యాదులు
తెలంగాణ (Telangana) బీజేపీ నాయకులు చిన్న చిన్న విషయాలకు కూడా ఢిల్లీకి ఫిర్యాదులు చేస్తారని రాజాసింగ్ ఆరోపించారు. అందుకే జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు చోటు దక్కలేదని పేర్కొన్నారు. తెలంగాణ నాయకులు మారరు అనే భావనతోనే జాతీయ నాయకత్వం వేరే రాష్ట్రాల వారికి అవకాశాలు ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు గ్రూప్ రాజకీయాలను పక్కనబెట్టి కలసికట్టుగా పనిచేయాలని ఆయన హితవు పలికారు. తెలంగాణ బీజేపీ నేతలు వర్గపోరును పక్కన పెట్టి బెంగాల్ తరహాలో పని చేయాలన్నారు. అందరు ఒక్కటై అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాజాసింగ్ పేర్కొన్నారు. తెలంగాణ నాయకులు ఆలోచించి తెలంగాణ కాషాయ రాజ్యం రావాలని పని చేయాలన్నారు.
ఇది కూడా చదవండి..: Harish Rao House Arrest | హరీశ్ రావు సహా బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్