అక్షరటుడే, తెయూ క్యాంపస్: Mahender Aileni | తెలంగాణ యూనివర్సిటీ Telangana University బయోటెక్నాలజీ విభాగం నూతన విభాగాధిపతిగా డా. మహేందర్ ఐలేని నియమితులయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి ఉత్తర్వులు జారీ చేశారు.
Mahender Aileni | తెవివిలో పలు బాధ్యతలు..
డా. మహేందర్ ఐలేని గతంలో తెలంగాణ యూనివర్సిటీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. బయోటెక్నాలజీ విభాగాధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా, చీఫ్ వార్డెన్ (హాస్టల్స్)గా, యూజీసీ కోఆర్డినేటర్‌గా సేవలందించారు.
Konda Surekha | మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు!
అదేవిధంగా ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా, యూజీ పరీక్షల కాన్ఫిడెన్షియల్ విభాగంలో, సారంగపూర్ బి.ఎడ్ కళాశాల ప్రిన్సిపల్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. వివిధ పరిపాలనా, విద్యా విభాగాల్లో ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని బయోటెక్నాలజీ విభాగాధిపతిగా నియమించినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.