Agricultural College Building | వ్యవసాయ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ

వ్యవసాయ కళాశాలలో పూర్తిస్థాయిలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామని, నాలుగు బ్లాక్ లు అదనంగా ఉంటాయని వీసీ జానయ్య పేర్కొన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Agricultural College Building | నిజామాబాద్ ఉమ్మడి​ జిల్లాకు మంజూరైన నూతన వ్యవసాయ కళాశాల భవనాల నిర్మాణానికి బుధవారం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ అల్టాస్ జానయ్య, తెయూ వీసీ యాదగిరిరావుతో కలిసి భూమిపూజ చేశారు. రూ. 123 కోట్ల తో చేపట్టనున్నట్లు జానయ్య తెలిపారు.

Agricultural College Building | కళాశాలలో 120 సీట్లు..

డిచ్​పల్లి వ్యవసాయ కళాశాల తెలంగాణ Telangana రాష్ట్రంలో 11వ కళాశాల అని చెప్పారు. హుజూర్​నగర్, కొడంగల్​లో పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక వ్యవసాయ కళాశాల ఉన్నట్లేనని వివరించారు.

Telangana Employee Retirement | రిటైర్మెంట్ల పర్వం.. తెలంగాణ ఖజానాపై పెరుగుతున్న పింఛన్ల భారం

కళాశాలలో 120 సీట్లు ఉంటాయని, వచ్చె ఏడాది నాటి విద్యార్థులకు భవన నిర్మాణం జరిగే విధంగా శ్రద్ద తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కళాశాలకు 2026 ఫ్రిబవరి 6న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారన్నారు.

Agricultural College Building | నాలుగు బ్లాక్​లు

వ్యవసాయ కళాశాలలో పూర్తిస్థాయిలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తామని, నాలుగు బ్లాక్ లు అదనంగా ఉంటాయని వీసీ జానయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ డీన్ డాక్టర్ ఝాన్సీ రాణి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సీహెచ్ వేణు గోపాల్ రెడ్డి, డీన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఎస్టేట్ ఆఫీసర్ డాక్టర్ కేవీ రమణారావు తదితరులు పాల్గొన్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *