Stock Market Gains | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ ఏడు సెషన్ల తర్వాత లాభాల బాట పట్టింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 520 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Gains | గ్లోబల్ మార్కెట్లలో లాభాలను అనుసరించి గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. బాండ్ ఈల్డ్స్ తగ్గితే భారతదేశం వంటి వర్ధమాన మార్కెట్లలోకి విదేశీ నిధుల ప్రవాహం పెరిగే అవకాశాలు ఉంటాయన్న ఆశావహ దృక్పథంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు.

Stock Market Gains | భారీ లాభాలతో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) గురువారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 559 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 45 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 142 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో మొదటైనా కొంత కరెక్షన్‌కు గురై 42 పాయింట్లు తగ్గింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 520 పాయింట్ల లాభంతో 77,430 వద్ద, నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 24,213 వద్ద ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్ల రాణింపుతో ప్రధాన సూచీలు పరుగులు తీస్తున్నాయి.

Stock Market Gains | ఐటీ సెక్టార్‌లో ర్యాలీ..

ఇటీవలి కాలంలో నష్టాలతో కుదేలవుతున్న ఐటీ సెక్టార్ గురువారం కోలుకుంది. నిఫ్టీ ఐటీ సూచీ ఒక శాతం లాభపడింది. కోఫోర్జ్ 3.25 శాతం, పర్సిస్టెంట్ సిస్టమ్స్ 2.6 శాతం, ఇన్ఫోసిస్ ఒక శాతానికిపైగా లాభంతో ఉంది. టెక్ మహీంద్రా, టీసీఎస్ రాణిస్తున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 26 స్టాక్స్ లాభాలతో, 4 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్ 2.03 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.61 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.47 శాతం, కొటక్ బ్యాంక్ 1.34 శాతం, పవర్‌గ్రిడ్ 1.16 శాతం లాభాలతో ఉన్నాయి.

Losers : ఆసియన్ పెయింట్ 0.24 శాతం, టాటా స్టీల్ 0.16 శాతం, ఐటీసీ 0.07 శాతం, సన్‌ఫార్మా 0.02 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Aug 20 Gold Prices | ఏడాదిలో పసిడి ధరల్లో 59 శాతం పెరుగుదల.. వెండి 110 శాతం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *