Aug 21 Market Analysis | లాభాల్లో ఆసియా మార్కెట్లు..ఫ్లాట్ ఓపెనింగ్ ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ఆసియా మార్కెట్లు లాభాలబాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లూ స్థిరంగా ప్రారంభం కానున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 21 Market Analysis | పశ్చిమాసియాలో అనిశ్చితి కొనసాగుతుండడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతోపాటు దీర్ఘకాలిక యూఎస్ బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడంతో వాల్‌స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మళ్లీ బలహీనపడింది. దీంతో యూఎస్ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. అయితే శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు మాత్రం స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.

Aug 21 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.00 శాతం, ఎస్ అండ్ పీ 0.87 శాతం నష్టపోగా.. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.03 శాతం లాభంతో ఉంది.

Aug 21 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.04 శాతం లాభపడగా.. జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.42 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.58 శాతం నష్టపోయాయి.

Aug 21 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.73 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.67 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.17 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.16 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.08 శాతం లాభంతో.. జపాన్‌కు చెందిన నిక్కీ 0.37 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.07 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు పాజిటివ్ గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

Aug 21 Horoscope | వరలక్ష్మీ వ్రతం శుభవేళ..ఈ రాశుల వారికి స్పెక్యులేషన్స్ ద్వారా బంపర్ లాభాలు

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 583 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు గత సెషన్‌లో నికరంగా రూ. 3,537 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 95.71 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 93.75 డాలర్ల వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.81 నుంచి 1.12 కు పెరిగింది.
  • విక్స్ 5.01 శాతం తగ్గి 10.76 వద్ద ఉంది. ఇది ఈ ఏడాది జనవరి 8 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి.
  • యూఎస్ డాలర్ Dollar ఇండెక్స్ 98.77 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.71 వద్ద ఉన్నాయి.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *