CM Chandrababu | అనకాపల్లి దేశంలో నంబర్​ వన్​ అవుతుంది : చంద్రబాబు

అనకాపల్లి అంటే బెల్లం ఒక్కటే కాదని, ఇండస్ట్రియల్‌ ఏరియా అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Chandrababu | అనకాపల్లి అంటే బెల్లం ఒక్కటే కాదని, ఇండస్ట్రియల్‌ ఏరియా అని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో అనకాపల్లి దేశంలోనే నెంబర్‌ వన్‌ అవుతుందన్నారు.

అనకాపల్లి జిల్లా (Anakapalle District) మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం అలమండలోని స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము చేసిన పనిని అభిమానిస్తే అదే పెద్ద కిక్‌ అన్నారు. తనకుకు ఎప్పుడూ సవాళ్లే అని పేర్కొన్నారు. డేటా సెంటర్‌ వస్తే నీళ్లు దొరకవంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డేటా సెంటర్‌ అంటే ఏంటో తెలియని వాళ్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. డేటా సెంటర్‌ ఇంకా ప్రారంభం కాలేదని, అప్పుడే నీళ్లు ఇంకిపోయాయని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu | వెలిగొండ నిర్వాసితులకు పరిహారం

చంద్రబాబు అంతకు ముందు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులైన 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారం చెక్కును క్యాంప్ కార్యాలయంలో అందించారు. అనంతరం నిర్వాసితులతో మాట్లాడారు. ఆగస్టు 31న వెలిగొండ ద్వారా నీళ్లు విడుదల చేస్తామన్నారు. 48 రోజుల్లో కూటమి ప్రభుత్వంం రూ.768 కోట్ల పరిహారం చెల్లించింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Lingamneni Sanjush | రోడ్డు ప్రమాదంలో యువతి మృతి కేసు.. డ్రగ్స్, మద్యం పరీక్షల్లో ఎంపీ కుమారుడికి నెగెటివ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *