అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Ganja Seized | త్వరగా డబ్బు సంపాదించవచ్చన్న ఆశతో ఒక ‘బ్లింకిట్’ డెలివరీ రైడర్ గంజాయి సరఫరా మార్గాన్ని ఎంచుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటల పాలయ్యాడు.
నిందితుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు. బ్లింకిట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న అతడు తన స్నేహితుడు అంకిత్ కుమార్ అలియాస్ శివతో పరిచయం పెంచుకున్నాడు. గంజాయి రవాణాతో భారీగా డబ్బులు సంపాదించవచ్చని శివ అతడికి చెప్పాడు. దీంతో నిందితుడు డబ్బుకు ఆశపడి గంజాయి రవాణాకు ఒప్పుకున్నాడు విశాఖపట్నం నుండి న్యూఢిల్లీకి రూ. 24.5 లక్షల విలువైన 48 కిలోల గంజాయిని తరలించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad)లో పోలీసులకు చిక్కాడు.
Hyderabad Ganja Seized | ఒంటరిగా వదిలి వెళ్లడంతో..
నిందితుడు, తన స్నేహితుడు శివతో కలిసి గంజాయి తీసుకొని బయలు దేరాడు. అయితే నాంపల్లి స్టేషన్‌కు వెళ్తుండగా.. శివ అతడిని మోసం చేశాడు. ఇప్పుడే వస్తానని చెప్పి పారిపోయాడు. దీంతో గంజాయితో ఒంటరిగా ఉన్న అతడు పోలీసులకు దొరికాడు. ఈ కేసులో న్యూఢిల్లీకి చెందిన బండియా, విశాఖపట్నానికి చెందిన నౌషాద్ అలియాస్ సునీల్, రాజేష్, శివ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Warehouse Fire | హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. గోదాములో చెలరేగిన మంటలు