Parandur Airport Project | విమానాశ్రయం ప్రాజెక్ట్​ను రద్దు చేసిన సీఎం విజయ్​

చెన్నై సమీపంలో కొత్త విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదనను సీఎం విజయ్​ పక్కన పెట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Parandur Airport Project | చెన్నై సమీపంలో కొత్త విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదనను సీఎం విజయ్​ పక్కన పెట్టారు. రాష్ట్ర రాజధానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరాందూరులోని ఎయిర్​పోర్టు నిర్మించాలని గత డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అప్పట్లో టీవీకే పార్టీ దీనిని వ్యతిరేకించింది.

తాజాగా ఆ ప్రాజెక్ట్​ను పక్కన పెడుతున్నట్లు సీఎం విజయ్​ (CM Vijay) ప్రకటించారు.తాము పరాందూరు విమానాశ్రయాన్ని  విరమించుకుంటున్నామని ఆయన పేర్కనొనారు. ఎయిర్​పోర్టుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. కాంచీపురం జిల్లా పరిధిలోకి వచ్చే పరందూర్‌లో విమానాశ్రయం నిర్మించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2025 ఏప్రిల్‌లో సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కోసం కేటాయించిన స్థలాన్ని సమీక్షిస్తామని విజయ్ ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఎయిర్​పోర్టు కోసం ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలిస్తామన్నారు.

Parandur Airport Project | డీఎంకే వాకౌట్​

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సహకారంతో చెన్నై విమానాశ్రయం వాయువ్య ప్రాంతంలో, ఒక అప్రోచ్ రోడ్డు, ఫ్లైఓవర్‌తో పాటు, కొత్త టెర్మినల్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం విజయ్​ తెలిపారు. డీఎంకే ఈ విషయంపై మాట్లాడటానికి ప్రయత్నించగా, తాను  అనుమతించబోనని స్పీకర్ ప్రభాకర్ అన్నారు. కేవలం వివరణ కోరుకుంటున్నానని మాజీ ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు అన్నారు. స్పీకర్ తన వాదనకే కట్టుబడి ఉండటంతో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.పారిశ్రామిక అభివృద్ధిలో విమానాశ్రయాల పాత్ర గురించి తనకు పూర్తి అవగాహన ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పరందూర్‌లో విమానాశ్రయం నిర్మించడంతో విస్తారమైన వ్యవసాయ భూములు, మానవ నివాసాలు ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అక్కడ విమానాశ్రయం నిర్మించకూడదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Onion Prices | భారీగా పెరిగిన ఉల్లి ధరలు.. కేంద్రం కీలక చర్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *