Aug 25 Market Analysis | నెగెటివ్​గా ఆసియా మార్కెట్లు..నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్ గా ఉండడంతో మన మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aug 25 Market Analysis | పెట్టుబడిదారులు టెక్నాలజీ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో వాల్ స్ట్రీట్(Wall street) నష్టాలబాటలో సాగింది. మంగళవారం ఆసియా ఈక్విటీలు దానిని అనుసరిస్తున్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) ఇస్తోంది.

Aug 25 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.76 శాతం, ఎస్ అండ్ పీ 0.28 శాతం నష్టపోగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.02 శాతం నష్టంతో ఉంది.

Aug 25 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.11 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.37 శాతం నష్టపోగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ 0.35 శాతం లాభంతో ముగిసింది.

Aug 25 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.16 శాతం లాభంతో.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.95 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.94 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.16 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.10 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.04 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.24 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి: ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్‌లో నికరంగా రూ. 1,181 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • డీఐఐలు వరుసగా పదో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,493 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలహీనపడి 95.74 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 92.81 డాలర్ల వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.11 నుంచి 0.83 కు తగ్గింది.
  • విక్స్ 2.95 శాతం పెరిగి 11.52 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.02 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.72 వద్ద ఉన్నాయి.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *