అక్షరటుడే, వెబ్డెస్క్: Weather Update | రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు పశ్చిమ, మధ్య మరియు తూర్పు తెలంగాణ (Telangana) జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రోజంతా వాతావరణం దాదాపు పొడిగా ఉంటుంది. అక్కడక్కడ చెదురమొదురు జల్లులు కురుస్తాయి. రాత్రి పూట భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
Weather Update | లోటు వర్షపాతం
రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో లోటు వర్షపాతం నమోదు అయింది. ఆగస్టు 24 నాటికి సాధారణ వర్షపాతం 524.8 మి.మీ. కాగా.. 457.6 మి.మీ. వర్షం కురిసింది. 13 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. ఎల్నినో ప్రభావం ఉన్నా.. కామారెడ్డి జిల్లాలో 24 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. మెదక్లో 19, సిరిసిల్ల 15 శాతం, రంగారెడ్డి 6, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 3 శాతం అధిక వర్షపాతం నమోదు అయింది. మండలాల వారిగా చూస్తే కామారెడ్డి మండలంలో 51 శాతం, బాన్సువాడ మండలంలో 35శాతం అధిక వర్షాలు కురిశాయి. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 68 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది.
ఇది కూడా చదవండి..: Ponguleti Srinivas Reddy | 22ఏపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి పొంగులేటి