iQOO Z11 Sale | ఐక్యూ జెడ్ 11.. సేల్ షురూ!

ఐక్యూ తన ‘జెడ్’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​:  iQOO Z11 Sale | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ అయిన ఐక్యూ తన ‘జెడ్’ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఐక్యూ జెడ్ 11 పేరుతో తీసుకువచ్చిన ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 7050 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. అమెజాన్‌ (Amazon)తోపాటు ఐక్యూ ఇండియా వెబ్‌సైట్, సంబంధిత రిటైయిల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసేద్దామా..

డిస్‌ప్లే : 6.83 అంగుళాల 1.5కే 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 144 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఫోన్ బరువు 199 గ్రాములు.
ఐపీ68, ఐపీ69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది.

ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్ తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6పై పనిచేస్తుంది. ఐక్యూ తన జెడ్ సిరీస్‌లో తొలిసారి 3,800 స్క్వేర్ ఎంఎం వాపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చింది. మూడేళ్లపాటు ఓఎస్, ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

బ్యాటరీ : 7,050ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 44డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

కెమెరా సెటప్ : వెనక వైపు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 882 ఓఐఎస్ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, ముందువైపు సెల్ఫీలకోసం 32 ఎంపీ కెమెరా ఇచ్చారు.

iQOO Z11 Sale | విద్యార్థుల కోసం ప్రత్యేక ఫీచర్లు..

ఈ ఫోన్‌లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఫీచర్లను అందుబాటులో ఉంచారు. ఆన్‌లైన్ క్లాస్‌లు వినేవారు ‘ఏఐ క్యాప్షన్ ’ సాయంతో ఆడియోను ట్రాన్స్‌క్రిప్షన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే ప్రాంతీయ భాషలనూ జోడించనున్నట్లు కంపెనీ తెలిపింది.

iQOO Z11 Sale | నాలుగు వేరియంట్లలో..

ఈ స్మార్ట్‌ఫోన్ అరోరా గ్రీన్, సెలెస్టియల్ బ్లూ రంగుల్లో, నాలుగు వేరియంట్లలో లభిస్తోంది.
6జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.34,999.
8జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ.39,999.
8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.44,999.
12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.49,999.
లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌ల క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై రూ.3 వేల వరకు తక్షణ రాయితీ లభించనుంది.
ఈ ఫోన్ పై రూ.వెయ్యి విలువైన కూపన్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి..: Stock Market Gains | తగ్గిన క్రూడాయిల్ ధర.. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *