AP Drought Crisis | రాష్ట్రంలో కరువు ఉన్నా సీఎం స్పందించడం లేదు : వైఎస్​ జగన్​

ఆంధ్రప్రదేశ్​లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్​ అన్నారు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Drought Crisis | ఆంధ్రప్రదేశ్​లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్​ అన్నారు. అయినా కూడా సీఎం చంద్రబాబు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్​ బుధవారం మీడియాతో మాట్లాడారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 52 శాతం లోటు వర్షపాతం ఉందని పేర్కొన్నారు. కరువు దారుణంగా ఉన్నా చంద్రబాబు (CM Chandrababu) కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 688 మండలాలకు గాను 628 మండలాల్లో లోటు వర్షపాతం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కోస్తాలోనూ కరువు ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కరువును గుర్తించేందుకు కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.

AP Drought Crisis | రైతులను మోసం చేశారు

వెన్నుపోటు పార్టీ ప్ర‌భుత్వంలోని మంత్రులు ప‌బ్లిసిటీ పిచ్చితో రైతుల‌ను మోసం చేశారని జగన్​ అన్నారు. నీళ్లు ఇస్తార‌ని న‌మ్మి రైతులు అష్ట‌కష్టాలు ప‌డి విత‌నాలు, ఎరువులు కొని నార్లు నాటారన్నారు. అయితే ప్రస్తుతం నీరు లేక అవ‌న్నీ ఎండిపోయిన ప‌రిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రైతులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ముందుకురావడం లేదని మండిపడ్డారు. ఎల్‌నినో ఎఫెక్ట్ ఉందని తెలిసినా ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. శ్రీశైలం నుంచి అటు తెలంగాణ, ఇటు ఏపీ ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని జగన్​ అన్నారు. ఇలానే కొనసాగితే మూడు వారాల్లోనే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు పడిపోతుందని, అప్పుడు రాయలసీమకు నీళ్లు ఇవ్వలేరన్నారు.

AP Drought Crisis | బీసీలకు న్యాయం చేశాం

వైసీపీ హయాంలో బీసీలకు న్యాయం చేశామని జగన్​ పేర్కొన్నారు. 40 శాతం మంత్రి పదవులు బీసీలకే ఇచ్చామని వెల్లడించారు. రాజ్యసభకు నలుగురు బీసీలను పంపామని, 6 జెడ్పీ ఛైర్మన్​ సీట్లు, 9 మేయర్​ స్థానాలను బీసీలకు కేటాయించామని వివరించారు. వివిధ పథకాల ద్వారా డీబీటీ పద్ధతిలో..రూ.లక్షా 30 వేల కోట్లు బీసీలకు అందజేశామన్నారు.

ఇది కూడా చదవండి..: Venkaiah Naidu Free Schemes | విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వండి.. నగదు కాదు: వెంకయ్య నాయుడు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *