అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 27 Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం Gold ధరలు స్వల్ప తగ్గుదల తర్వాత ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో గురువారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,63,750గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1,50,100 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలోనూ నేడు ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ఇటీవల కిలో వెండి Silver ధర రూ.10,000 వరకు తగ్గినప్పటికీ.. ప్రస్తుతం కిలో ధర రూ.2,65,000 వద్ద స్థిరంగా ఉంది.
Aug 27 Gold Prices | ప్రధాన నగరాల వారీగా..
విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో కూడా బంగారం, వెండి ధరలు హైదరాబాద్‌తో సమానంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,63,750 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,50,100 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.2,65,000గా కొనసాగుతోంది.
Aug 27 Gold Prices | అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి స్వల్ప నష్టం
ప్రపంచ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు దాదాపు 16 డాలర్లు తగ్గి ప్రస్తుతం 4,621 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. స్పాట్ సిల్వర్ రేటు 0.58 శాతం మేర పెరిగి ఔన్సుకు 69 డాలర్ల స్థాయిలో ఉంది.
Aug 27 Gold Prices | కొనుగోలుదారులు గమనించాల్సిన విషయం
బులియన్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, స్థానిక డిమాండ్ తదితర అంశాల ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఆభరణాల కొనుగోలు సమయంలో ప్రకటించిన బంగారం ధరకు అదనంగా మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ తదితర ఖర్చులు వర్తించే అవకాశం ఉంటుంది.
Aug 27 Horoscope | సమాజంలో ప్రముఖులతో పరిచయాలు… ఈ రాశుల వారికి పెరగనున్న క్రేజ్!