అక్షరటుడే, వెబ్డెస్క్: Fake Doctors | వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కట్టుబడిన ఇప్పటికే కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు.
నగరంలో ప్రజల ప్రాణాలతో చెలాగటం ఆడుతున్న నకిలీ వైద్యులపై నిఘా పెట్టినట్లు సీపీ (CP Sajjanar) వెల్లడించారు. 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి విద్యార్హతలూ, కనీస వైద్య పరిజ్ఞానం లేని వీరు అసలైన వైద్యుల తరహాలోనే నటిస్తూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Fake Doctors | దెబ్బతింటున్న అవయవాలు
నకిలీ వైద్యుల అవగాహనారాహిత్యంతో రోజుల తరబడి మందులు వాడాలని సూచించడంతో ప్రజల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి మోసగాళ్లపై పోలీసుల నిఘా కొనసాగుతోందని, ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండాలన్నారు. క్లినిక్లు, ఆసుపత్రుల రిసెప్షన్ వద్ద జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను ప్రదర్శించారో లేదో గమనించాలన్నారు.
వైద్యుల బోర్డులపై పేరు, విద్యార్హతలతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (TSMC) కేటాయించిన రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. వైద్యుల వివరాలపై ఏమాత్రం సందేహం కలిగినా వెంటనే https://onlinetsmc.in వెబ్సైట్లోకి వెళ్లి Doctor Searchలో పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి వారి వివరాలను సరిచూసుకోవచ్చని ఆయన తెలిపారు. అక్కడ వివరాలు కనిపించకపోతే వారు నకిలీలని గుర్తించాలన్నారు.
ఇది కూడా చదవండి..: Balaji Sweet House | స్వీట్ షాపుపై పోలీసుల దాడి.. కేసు నమోదు