Stock Market Losses | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం భారీ నష్టాలతో ముగిసింది. 

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market Losses | దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం వరుసగా రెండో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. మెటల్, పీఎస్‌యూ, సిమెంట్ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించడం, ఎక్స్‌పైరీ సెషన్ కావడంతో సెన్సెక్స్ భారీగా నష్టపోయింది.

Stock Market Losses | లాభాలతో ప్రారంభమైనా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 104 పాయింట్ల గ్యాప్ అప్‌తో ప్రారంభమై మరో 118 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 761 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 20 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 207 పాయింట్లు తగ్గింది. చివరి నిమిషంలో సూచీలు భారీగా నష్టపోయాయి. చివరికి సెన్సెక్స్ 539 పాయింట్ల నష్టంతో 76,933 వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల నష్టంతో 24,090 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,824 కంపెనీలు లాభపడగా 2,491 స్టాక్స్ నష్టపోయాయి. 211 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 157 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 80 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 13 స్టాక్ లాభపడగా.. 17 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. కొటక్ బ్యాంక్ 1.71 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.93 శాతం, టెక్ మహీంద్రా 0.80 శాతం, బీఈఎల్ 0.54 శాతం, అదానీపోర్ట్స్ 0.36 శాతం లాభపడ్డాయి.

Top Losers : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.08 శాతం, ఎన్టీపీసీ 2.03 శాతం, ఎం అండ్ ఎం 1.77 శాతం, ఎయిర్‌టెల్ 1.42 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.37 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Losses | నష్టాల్లో సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *