Stock Market Gains | ఐటీ సెక్టార్‌లో కొనుగోళ్ల మద్దతు.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | ఐటీ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం లాభాల బాటలో సాగుతోంది. ఉదయం సెన్సెక్స్ 99 పాయింట్ల లాభంతో ప్రారంభమై తొలుత 246 పాయింట్లు కోల్పోయింది.

అక్కడినుంచి కోలుకుని 619 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో ప్రారంభమెనా మొదట్లో 26 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 176 పాయింట్లు లాభపడింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 138 పాయింట్ల లాభంతో 75,536 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 23,742 వద్ద ఉన్నాయి.

Stock Market Gains | మిక్స్‌డ్ గా ఇండెక్స్‌లు..

నిఫ్టీ (Nifty)లో మీడియా ఇండెక్స్ 3.73 శాతం, ఐటీ 1.67 శాతం, టెలికాం 1.09 శాతం, ఎఫ్ ఎంసీఈ 0.85 శాతం, ఫార్మా 0.71 శాతం లాభాలతో ఉండగా.. ఆయిల్ అండ్ గ్యాస్ 1.30 శాతం, రియాలిటీ 1.12 శాతం, మెటల్ 1.08 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.88 శాతం నష్టాలతో సాగుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో, 13 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 2.21 శాతం, కొటక్ బ్యాంక్ 2.15 శాతం, అదానీ పోర్ట్స్ 2.14 శాతం, ఎయిర్‌టెల్ 1.62 శాతం, టీసీఎస్ 1.51 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ట్రెంట్ 2.01 శాతం, రిలయన్స్ 1.70 శాతం, ఎంఅండ్ఎం 1.36 శాతం, ఎస్ బీఐ 1.26 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.97 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: May 15 Gold Rates | భగభగమంటున్న పసిడి.. మూడు రోజుల్లోనే భారీగా పెరుగుదల!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *