అక్షరటుడే, వెబ్డెస్క్: KNRUHS MBBS Web Options | తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ వేగం పుంజుకుంది.
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (KNRUHS) ఆధ్వర్యంలో కాంపిటెంట్ అథారిటీ కోటా (CQ) కింద ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి తొలి దశ కౌన్సెలింగ్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్ విడుదలైంది.
KNRUHS MBBS Web Options | సెప్టెంబరు 1 వరకు..
తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర 1 మధ్యాహ్నం 12 గంటల వరకు అభ్యర్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక కౌన్సెలింగ్ వెబ్సైట్ను వినియోగించాల్సి ఉంటుంది.
KNRUHS MBBS Web Options | ఈ కళాశాలలకు వర్తింపు
కాంపిటెంట్ అథారిటీ కోటా కింద నిర్వహిస్తున్న ఈ కౌన్సెలింగ్లో ప్రధానంగా.. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్-మైనారిటీ వైద్య కళాశాలలు, KNRUHSకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ వైద్య కళాశాలలోని ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయనున్నారు.
KNRUHS MBBS Web Options | ఆప్షన్ల నమోదులో జాగ్రత్త అవసరం
అభ్యర్థులు తమ NEET-UG 2026 ర్యాంకు, కేటగిరీ, అర్హత, అందుబాటులో ఉన్న సీట్లు, కళాశాల ప్రాధాన్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆప్షన్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆప్షన్లను నమోదు చేసిన తర్వాత వాటిని మరోసారి పరిశీలించి, నిర్ణీత గడువులోగా సబ్మిట్ చేయడం కీలకం.
KNRUHS అధికారిక నోటిఫికేషన్ల ప్రకారం MBBS Competent Authority Quota ప్రవేశాల ప్రక్రియలో సీట్ల వివరాలు, మెరిట్ ఆధారిత కౌన్సెలింగ్, తదుపరి దశల కౌన్సెలింగ్ వంటి ప్రక్రియలు విడతలవారీగా కొనసాగుతాయి.