అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana SIR Process | తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ( Revanth Reddy )కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) లేఖ రాశారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువును పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దాదాపు 73.39 లక్షల మంది (మొత్తం ఓటర్లలో 21.7%) ‘అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డ్యూప్లికేట్’ (ASDD) జాబితాలోకి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. డ్రాఫ్ట్ రోల్‌లో లోపాలు, మ్యాపింగ్ లేకపోవడం వల్ల సగానికి పైగా ఓటర్లు మళ్లీ తమ అర్హతను నిరూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, మొత్తంగా 92.86 లక్షల మందికి నోటీసులు అందాయని వెల్లడించారు. నమోదైన మొత్తం ASDD కేసుల్లో ఒక్క హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే అత్యధికంగా 58.6 శాతం కేసులు ఉన్నట్లు తెలిపారు.
Telangana SIR Process | నాలుగు వారాలు పొడిగించాలని..
లక్షలాది మంది ఓటు హక్కును పరిరక్షించేందుకు అక్షేపణలు, ఫిర్యాదుల సమర్పణ గడువును సెప్టెంబర్ 16 నుండి మరో నాలుగు వారాలు పొడిగించాలని, ఓటర్లకు నోటీసులు అందిన తర్వాత తగిన ఆధారాలతో స్పందించేందుకు కనీసం 3 నుంచి 4 వారాల వ్యవధి ఇవ్వాలని, పౌరులందరికీ ఓటు హక్కు పరిస్థితి తెలిసేలా గ్రామసభలు, వార్డుల్లో కనీసం రెండుసార్లు ఓటర్ల జాబితాను బిగ్గరగా చదివి వినిపించడంతోపాటు పట్టణ ప్రాంతాల్లో బూత్ స్థాయిలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, ఓటర్లు సులభంగా పొందేలా మండల స్థాయిలో లభించే అధికారిక పత్రాలను కూడా సవరణల ధ్రువీకరణకు ఆమోదించాలని మరియు విచారణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను (ERO) నియమించి విచారణ సమయాన్ని వికేంద్రీకరించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Lumino Industries IPO | భారీగా జీఎంపీ.. ఈపీసీ కంపెనీ ఐపీవోపై లుక్కేయండి