ఆంధ్రప్రదేశ్​Vizianagaram Road Accident : పాదచారులపైకి దూసుకెళ్లి..లారీని ఢీకొట్టి.. విజయనగరంలో కారు బీభత్సం.. నలుగురి దుర్మరణం.....

Vizianagaram Road Accident : పాదచారులపైకి దూసుకెళ్లి..లారీని ఢీకొట్టి.. విజయనగరంలో కారు బీభత్సం.. నలుగురి దుర్మరణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. రహదారులపై అతివేగం ప్రమాదాలకు కారణమవుతోందని పోలీసులు వాహనదారులకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vizianagaram Road Accident : Vizianagaram districtలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. Perapuram సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. అనంతరం అక్కడే నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Vizianagaram Road Accident : అతి వేగం..

పోలీసుల వివరాల ప్రకారం, అతివేగంగా వచ్చిన కారు ముందుగా రహదారి పక్కన నడుస్తున్న ముగ్గురు పాదచారులపైకి దూసుకెళ్లింది. అనంతరం నియంత్రణ కోల్పోయిన కొద్దిదూరంలో నిలిచివున్న లారీని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో Visakhapatnamకు చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ శ్రీనివాసరావుతో పాటు ముగ్గురు పాదచారులు మరణించినట్లు చెందినట్లు అధికారులు తెలిపారు.

Vizianagaram Road Accident : ఇద్దరి పరిస్థితి విషమం

ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని వెంటనే సమీప ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం Maharaja Hospitalకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ Damodar సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ప్రాథమిక దర్యాప్తులో అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

Hong Kong Housing Crisis : వరల్డ్ రిచెస్ట్ సిటీలో గృహ సంక్షోభం.. అట్ట పెట్టెల్లో జీవనం.. భారత్‌లోనూ ఇదే పరిస్థితి వస్తుందా?

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....