అక్షరటుడే, వెబ్డెస్క్ : Messi Event Refund | బెంగాల్ సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామని ప్రకటించారు.
కోల్‌కతా (Kolkata)లో గతేడాది నిర్వహించిన మెస్సీ ఈవెంట్లో గందరగోళం చోటు చేసుకుంది. మెస్సీ ఈవెంట్ నిర్వహణలో గత టీఎంసీ సర్కార్ విఫలమైందంటూ విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మెస్సీ ఈవెంట్ కోసం టికెట్ కొన్న 33 వేల మందికి సొమ్ము రీఫండ్ చేస్తామని సీఎం తెలిపారు. యువ భారతి స్టేడియంలో జరిగిన గందరగోళపూరితమైన లియోనెల్ మెస్సీ కార్యక్రమానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన 33,000 మంది అభిమానుల డబ్బును రాష్ట్ర క్రీడా బడ్జెట్ నుండి తిరిగి చెల్లిస్తామని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించారు.
Messi Event Refund | మెస్సీ ఈవెంట్.. అభిమానుల ఆగ్రహం
టీఎంసీ (TMC) హయాంలో గతేడాది డిసెంబర్ 13న లియోనెల్ మెస్సీ యువ భారతి స్టేడియాన్ని సందర్శించారు. ఆ కార్యక్రమం గందరగోళంతో నిండిపోయింది. క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్ అతిగా జోక్యం చేసుకోవడం వల్లే ఈ అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు వచ్చాయి. ఈవెంట్ నిర్వహణ లోపంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో కుర్చిలు విరగొట్టారు. సామగ్రి ధ్వంసం చేసి నిరసన తెలిపారు. ఆ రోజు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు రూ. 4,000, రూ. 6,000 విలువైన టిక్కెట్ల కోసం డబ్బు వాపసు కోరినప్పటికీ, ఆ డిమాండ్ ఇప్పటివరకు నెరవేరలేదు. ఈ క్రమంలో తాజాగా సీఎం సువేందు ఆ డబ్బులు రీఫండ్ చేస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి : Guruvayur Temple Weddings | ఆలయంలో ఒకేసారి 372 జంటల వివాహం