బిజినెస్​April 28 Market Analysis | మిక్స్‌డ్​గా గ్లోబల్ క్యూస్ .. గ్యాప్ డౌన్ లో...

April 28 Market Analysis | మిక్స్‌డ్​గా గ్లోబల్ క్యూస్ .. గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్న దేశీయ మార్కెట్లు

ప్రధాన గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్ గా సాగుతున్నాయి. మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

అక్షరటుడే, వెబ్‌డెస్క్: April 28 Market Analysis | పశ్చిమాసియా(West Asia)లో సంక్షోభంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడంతో గ్లోబల్ మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసినా యూరోపియన్ మార్కెట్లు మాత్రం నష్టపోయాయి. మంగళవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో సాగుతున్నాయి.

April 28 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.20 శాతం, ఎస్ అండ్ పీ 0.12 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.13 శాతం లాభంతో ఉంది.

April 28 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.20 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.19 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.56 శాతం నష్టపోయాయి.

April 28 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8.10 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 0.87 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.42 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.26 శాతం లాభంతో కొనసాగుతుండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.66 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.52 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.18 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.42 శాతం నష్టంతో సాగుతుండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా ఆరో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,151 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
  • డీఐఐలు వరుసగా 3వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 4,124 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.78 నుంచి 1 కు పెరిగింది.
  • విక్స్ 6.77 శాతం తగ్గి 18.38 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 109.34 డాలర్లకు చేరింది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.56 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.35 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలపడి 94.19 వద్ద ఉంది.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

April 28 Gold Prices | త‌గ్గుముఖం ప‌డుతున్న పసిడి ధ‌ర‌.. దేశవ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

DJ Sound | డీజే శబ్దం భరించలేక 140 కోళ్లు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన

అక్షరటుడే, వెబ్​డెస్క్: DJ Sound | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని...

Bellamkonda Wedding | రుమలలో ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహం.. కావ్య రెడ్డితో కొత్త జీవితానికి శ్రీకారం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bellamkonda Wedding | తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక...

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...