అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Yoga Competitions | జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యోగా (YOGA) పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఐశ్వర్య కాళె తెలిపారు. ఈ మేరకు ప్రతినిధులు ఆదివారం వివరాలు వెల్లడించారు.
Yoga Competitions | నందిపేట్‌లోని ఉజ్వల హైస్కూల్లో..
నందిపేట్‌లోని ఉజ్వల హైస్కూల్లో 17వ జిల్లాస్థాయి యోగాసన పోటీలను (Yogasana competition) నిర్వహిస్తున్నట్లు ఐశ్వర్య తెలిపారు. ఈ పోటీలు ఎనిమిదేళ్ల నుంచి నుండి 80ఏళ్ల వయస్సు ఉన్న యోగా క్రీడాకారులకు వివిధ కేటగిరీల్లో బాలబాలికలు, మహిళలు, పురుషులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రిజిస్ట్రేషన్ కాపీలు, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. ఈ పోటీల గెలుపొందిన క్రీడాకారులు సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన సమాచారం కోసం ఐశ్వర్య కాళె (8106420241), టీవీ ప్రవీణ్ నాయుడు, సెక్రటరీ గంగాధర్ (8074982200)లలో సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: విశ్వ రహస్యాలను ఛేదించేందుకు నాసా మరో అడుగు.. అంతరిక్షంలోకి ‘మూడో కన్ను’