Cyprus boat capsizes | సముద్ర గర్భంలో మునిగిన ఫెర్రీ.. ఏడుగురి దుర్మరణం.. 23 మంది గల్లంతు

ఫెర్రీ మునిగిపోతున్న సమయంలో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేస్తూ, లైఫ్ జాకెట్లు ధరించి, బోల్తా పడిన పడవ పైభాగంలో నిలబడి సహాయం కోసం ఎదురుచూశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyprus boat capsizes | ప్రశాంతంగా సాగుతున్న సముద్ర ప్రయాణం క్షణాల్లో భయాందోళనగా, సజీవ నరకంగా మారింది. టర్కీ Tarkey లోని ఉత్తర సైప్రస్ తీరంలో 267 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ (ఫెలో జెట్ కేటమరాన్) బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 23 మంది ప్రయాణికులు సముద్రపు అగాధంలో గల్లంతయ్యారు.

Cyprus boat capsizes | సజీవ సమాధిగా మారిన పడవ..

నౌక సముద్ర ఉపరితలం నుంచి ఏకంగా 500 మీటర్ల (1,640 అడుగులు) లోతున మునిగిపోయింది. గల్లంతైన 23 మంది ప్రయాణికులు పడవ లోపలి భాగం నుంచి బయటకు రాలేక, మునిగిపోతున్న నౌకతో పాటే సముద్రపు అడుగు భాగానికి వెళ్లిపోయి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Cyprus boat capsizes | శ్మశాన నిశ్శబ్దం

ఫెర్రీ మునిగిపోతున్న సమయంలో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేస్తూ, లైఫ్ జాకెట్లు ధరించి, బోల్తా పడిన పడవ పైభాగంలో నిలబడి సహాయం కోసం ఎదురుచూశారు. రక్షించబడిన 237 మంది ప్రయాణికులు తీవ్రమైన దిగ్భ్రాంతికి (Shock) గురై మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. స్థానిక రెస్క్యూ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సముద్రంలో ‘శ్మశాన నిశ్శబ్దం’ అలముకుందని పేర్కొన్నారు.

Cyprus boat capsizes | సాంకేతిక లోపమా..?

తీరప్రాంతంలో సూర్యాస్తమయం దగ్గర పడటంతో వెలుతురు తగ్గి రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మునిగిపోయిన పడవలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సమయం అత్యంత వేగంగా మించిపోయింది.

Influencer Murder | ఇన్‌ఫ్లుయెన్సర్‌ను చెట్టుకు కట్టేసి.. నిప్పంటించి దారుణ హత్య

ప్రమాద సమయంలో సముద్రం ప్రశాంతంగానే ఉంది. ఈ నేపథ్యంలో నౌకలోని తీవ్ర సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *