అక్షరటుడే వెబ్‌డెస్క్: Delhi Bus Rape Case | దేశ రాజధాని ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh ) నుంచి వస్తున్న 16 ఏళ్ల బాలికపై ప్రైవేట్ స్లీపర్ బస్సులో డ్రైవర్, కండక్టర్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు కుల్దీప్, సందీప్‌లను అరెస్టు చేశారు.
Delhi Bus Rape Case | ప్రయాణంలో అమానుషం..
యూపీలోని మైన్‌పురి జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలిక కుటుంబంతో గొడవపడి నోయిడాలోని బంధువుల ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ వద్ద ఢిల్లీ వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎక్కింది. పరిచౌక్ నుంచి ఢిల్లీలోని కశ్మీరీ గేట్ వరకు ఉన్న దాదాపు 47 కిలోమీటర్ల ప్రయాణంలో ఈ దుశ్చర్య చోటుచేసుకుంది.
Delhi Bus Rape Case | పోలీసుల దర్యాప్తు..
బస్సు కిటికీలకు తెరలు వేసి ఉండటంతో లోపల ఏం జరుగుతుందో బయటకు కనిపించలేదు. అదును చూసుకుని డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం కశ్మీరీ గేట్ బస్ స్టాండ్ వద్ద ఆమెను దింపి పరారయ్యారు. అచేతన స్థితిలో ఉన్న బాధితురాలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా బస్సును గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: AR Constable Suicide | ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య