అక్షరటుడే వెబ్‌డెస్క్: Mohan Bhagwat Remarks | అమెరికా పర్యటనలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని భావించే వారు హిందువులు కారంటూ భగవత్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు.
Mohan Bhagwat Remarks | తీవ్ర విమర్శలు..
అమెరికాలో మత సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడుతున్న మోహన్ భగవత్.. అదే మాటను భారతదేశంలో ( India )ఎందుకు స్పష్టంగా ప్రకటించడం లేదని ఆయన నిలదీశారు. విదేశాల్లో ఒకలా, స్వదేశంలో మరోలా మాట్లాడటం ఆర్ఎస్ఎస్ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. అమెరికా పర్యటన సందర్భంగా స్థానికంగా ఎదురైన తీవ్ర వ్యతిరేకత, నిరసనల నుంచి తప్పుకోవడానికే భగవత్ ఇలాంటి మతసామరస్య వేదాంతం మాట్లాడారా అని నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్‌కు రెండు నాలుకలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
Mohan Bhagwat Remarks | చేతల్లో నిరూపించుకోవాలని..
భారతదేశంలో కూడా ముస్లింల హక్కులు, హిందూ-ముస్లిం ఐక్యతపై ఆర్ఎస్ఎస్ ఎలాంటి దాపరికం లేకుండా స్పష్టమైన, నిర్భయమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా, చేతల్లో కూడా ఆ సామరస్యాన్ని నిరూపించుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Veligonda Project | వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు