అక్షరటుడే వెబ్‌డెస్క్: Ranganath HYDRA Commissioner | హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టును ( High Court )ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి వెలువరించిన ఉత్తర్వులపై ఆయన డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశారు. వివాదాస్పద భూమి విషయంలో కోర్టు ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందని, యంత్రాలు, సిబ్బందితో ఆ భూమిలోకి ప్రవేశించడం చట్టవిరుద్ధమని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం గతంలో వ్యాఖ్యానించింది. పరిపాలనలో చట్టపాలనే జరగాలి తప్ప వ్యక్తుల ఆధిపత్యం చెల్లదని స్పష్టం చేసింది. ఒకే వివాదంలో మూడుసార్లు ధిక్కరణ పిటిషన్లు దాఖలు కావడం, హైడ్రాపై 60కి పైగా పిటిషన్లు పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.
Ranganath HYDRA Commissioner | బాధ్యతల నుంచి బదిలీ చేసి ..
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘టాటా మోహన్ రావు’ తీర్పును ప్రస్తావిస్తూ.. శిక్షించడం కంటే క్షమించడంలోనే ఔన్నత్యం ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ విచారణను ముగిస్తూనే, ఆయనను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి బదిలీ చేసి వేరే అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (CS) సింగిల్ జడ్జి సూచించారు.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో పేర్కొన్న కోర్టు వ్యాఖ్యలతో పాటు, తనను బదిలీ చేయాలన్న సూచనను సవాలు చేస్తూ రంగనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. తీర్పు వెలువడిన నెల రోజుల తర్వాత ఆయన అప్పీల్‌కు వెళ్లడంతో దీనిపై న్యాయస్థానం ఏవిధంగా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Danam Nagender comments | అధికారులను కొట్టడం నాకు అలవాటే.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు