Sridhar Vembu letter | అమెరికా నుంచి వచ్చేయండి.. జోహో శ్రీధర్ వేంబు ఎమోషనల్ లెటర్ వైరల్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sridhar Vembu letter | భారతీయుల విషయంలో అమెరికా (America)లో పెరుగుతున్న ద్వేషపూరిత ధోరణిని జోహో ఫౌండర్ శ్రీధర్ వేంబు ఎండగట్టారు. మన దేశానికి తిరిగి వచ్చేయాలని ఎన్నారైలను కోరారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియా (Social Media)లో పోస్ట్ చేసిన లేఖ వైరల్‌గా మారింది. మన దేశ యువతకు మార్గదర్శనం చేసేందుకు, భారత సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటేందుకు ప్రతిభావంతులైన ప్రవాస భారతీయులు మాతృభూమికి తిరిగి రావాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో ‘రివర్స్ మైగ్రేషన’పై చర్చ జరుగుతోంది.

Sridhar Vembu letter | శ్రీధర్ వేంబు ఏం రాశారంటే..

అమెరికా కల.. ప్రతి మధ్యతరగతి భారతీయ యువకుడి లక్ష్యం.. కానీ కాలం మారుతోంది. ఆ దేశం మనల్ని “ఉద్యోగాలు దొంగిలించే వాళ్లు”గా చూస్తోందా? అంటూ శ్రీధర్ వేంబు (Sridhar Vembu) బహిరంగ లేఖలో పేర్కొన్నారు. కేవలం భావోద్వేగంతోనే కాకుండా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలను విశ్లేషిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పునరాలోచింపజేస్తున్నాయి. అమెరికాలో పెరుగుతున్న యాంటీ -ఇమ్మిగ్రెంట్ ధోరణిని నిశితంగా పరిశీలించిన వేంబు.. US లో భారతీయుల (Indians) విజయాన్ని చూసి అసూయ పడే వర్గం ఒకటి బలంగా తయారైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘మీరు అనుకోవచ్చు.. రాబోయే ఎన్నికలు ఈ పరిస్థితిని మారుస్తాయని.. కానీ అక్కడ మీ ముందున్న ఆప్షన్లు భారతీయ నాగరికతను ద్వేషించే వారికీ, అసలు నాగరికతనే తృణీకరించే వారికీ మధ్య జరుగుతున్న పోరాటం మాత్రమే’ అని విశ్లేషించారు.

Sridhar Vembu letter | మాతృభూమికి న్యాయం జరగడం లేదు..

‘ప్రపంచంలో గౌరవం, భద్రత కేవలం ఒక దేశం యొక్క సాంకేతిక పటిమ ద్వారానే లభిస్తాయి. మన మేధస్సును మనం ఎగుమతి చేయడం వల్ల పరాయి దేశాలు బాగుపడుతున్నాయి తప్ప మన మాతృభూమికి సరైన న్యాయం జరగడం లేదు.’ అన్న అభిప్రాయాన్ని శ్రీధర్ వేంబు వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పుడు స్టార్టప్ ఎకో సిస్టమ్, తయారీ రంగం గత దశాబ్దం కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయంటూ.. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎన్నారైల నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ‘కృతజ్ఞత అనేది మన భారతీయుల రక్తంలోనే ఉంది. కానీ మన మేధస్సు మన దేశాభివృద్ధికి ఉపయోగపడాల్సిన సమయం ఆసన్నమైంది” అని ఆయన ఆ లేఖలో నొక్కి చెప్పారు.

Sridhar Vembu letter | మిశ్రమ స్పందన

జోహో ఫౌండర్ లేఖపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ‘1991 ఆర్థిక సంస్కరణల తర్వాత దేశం మారింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం వ్యాపార అనుకూల వాతావరణాన్ని, తక్కువ పన్నుల విధానాన్ని తీసుకొస్తేనే మేధో వలసను అడ్డుకోగలం’ అని ఒక యూజర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు వేంబు పిలుపును సమర్థించారు. మాతృభూమి కోసం తిరిగి రావడం ఒక గర్వకారణమైన విషయమంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Modi Football Gangtok | ఫుట్‌బాల్ ఆడిన మోదీ.. యువతతో కలిసి మైదానంలో సందడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *