అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Losses | అమెరికా, ఇరాన్‌ల మధ్య తాజాగా జరిగిన క్షిపణి దాడులతో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. గ్లోబల్ మార్కెట్లనుంచి అందుతున్న బలహీన సంకేతాలు భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలపైనా ప్రభావం చూపుతున్నాయి..
Stock Market Losses | అన్ని రంగాల్లో సెల్లాఫ్..
సెన్సెక్స్, నిఫ్టీ రెండు సూచీలూ బుధవారం ఉదయం గణనీయమైన నష్టాలను చవిచూశాయి. అన్ని రంగాల్లోనూ అమ్మకాల వెల్లువ కనిపిస్తోంది. ఆటో, రియాలిటీ సూచీలు రెండు శాతానికిపైగా పతనమయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ, కన్స్యూమర్ డ్యూరెబుల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ సూచీలు ఒక శాతం చొప్పున తగ్గాయి.
Stock Market Losses | భారీ గ్యాప్ డౌన్ లో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 473 పాయింట్ల గ్యాప్ డౌన్ లో ప్రారంభమై అక్కడినుంచి 61 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో మరో 397 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 197 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 38 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 110 పాయిట్లు పడిపోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 680 పాయింట్ల నష్టంతో 76,263 వద్ద, నిఫ్టీ 241 పాయింట్ల నష్టంతో 23,814 వద్ద ఉన్నాయి.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 స్టాక్స్ లాభాలతో, 26 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్ 0.70 శాతం, పవర్‌గ్రిడ్ 0.68 శాతం, ఐటీసీ 0.60 శాతం, ఎన్టీపీసీ 0.11 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎం అండ్ ఎం 2.92 శాతం, ఇండిగో 2.55 శాతం, ఆసియన్ పెయింట్ 2.22 శాతం, మారుతి 2.04 శాతం, బీఈఎల్ 1.84 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Sep 02 Gold Prices | బంగారం ధరలకు బ్రేక్.. నాలుగో రోజు వరుసగా పతనం