అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sep 03 Market Analysis | చమురు ధరలలో ర్యాలీ నిలిచిపోవడంతో గ్లోబల్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. మూడు రోజుల నష్టాల పరంపర నుంచి కోలుకుని వాల్ స్ట్రీట్ లాభాల బాట పట్టింది.
ఆసియా మార్కెట్లు గురువారం ఉదయం పాజిటివ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. సానుకూల ప్రపంచ సంకేతాల మధ్య భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 సైతం లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Sep 03 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 0.45 శాతం, ఎస్ అండ్ పీ 0.46 శాతం పెరిగాయి. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.11 శాతం లాభంతో ఉంది.
Sep 03 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకే UK కు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.31 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.26 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.51 శాతం నష్టంతో ముగిశాయి.
Sep 03 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా Asia మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.29 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.61 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.53 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.46 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.16 శాతం లాభంతో, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.09 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.50 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 6,688 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు వరుసగా 17 వ సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 2,812 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.89 నుంచి 0.87కు తగ్గింది.
- విక్స్ 3.6 శాతం పెరిగి 11.59 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 1 పైస బలహీనపడి 94.97 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95.62 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.54 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.78 వద్ద ఉన్నాయి.
- సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.