Indian Stock Market | బ్లాక్ మండే.. భారీగా పతనమైన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీగా పతనమైంది. సెన్సెక్స్ 1,124 పాయింట్లు, నిఫ్టీ 360 పాయింట్లు నష్టపోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market | భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతుండడం, ముడి చమురు ధరలలో పెరుగుదలకుతోడు బలహీనమైన ప్రపంచ సంకేతాల మధ్య ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలో ఆరు నెలల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మొత్తం 16 ప్రధాన సెక్టార్లు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.

Indian Stock Market | గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 161 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై మొదట్లో 6 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడితో 1,024 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 76 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 16 పాయింట్లు పెరిగినా.. నిలదొక్కుకోలేక అక్కడినుంచి 328 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 1,124 పాయింట్ల నష్టంతో 72,771 వద్ద, నిఫ్టీ 360 పాయింట్ల నష్టంతో 22,780 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,359 కంపెనీలు లాభపడగా 3,106 స్టాక్స్ నష్టపోయాయి. 252 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 165 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 198 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Indian Stock Market | ఒక్కటి మినహా..

బీఎస్ ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 29 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్ 0.20 శాతం లాభపడింది.

Top Losers : ఎల్టీ 2.81 శాతం, పవర్‌గ్రిడ్ 2.62 శాతం, అదానీపోర్ట్స్ 2.38 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.30 శాతం, హెచ్యూఎల్ 2.27 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధర పైపైకి.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *