అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Today | దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం గ్యాప్ అప్ లో ప్రారంభమైంది. అయితే గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టపోయాయి. మార్కెట్లు నష్టాలతో ముగియడానికి క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఆటో, ఐటీ షేర్లలో అమ్మకాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
Stock Market Today | ఐటీలో అమ్మకాలు..
ఐటీ కంపెనీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి కంపెనీలు ప్రధాన సూచీలను వెనక్కి లాగాయి.
Stock Market Today | గ్యాప్ అప్ లో ప్రారంభమైనా..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 154 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 200 పాయింట్లు పెరిగింది. అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే గరిష్టాలనుంచి 772 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 28 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 152 పాయిట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 417 పాయింట్ల నష్టంతో 76,152 వద్ద, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 23,873 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,545 కంపెనీలు లాభపడగా 1,778 స్టాక్స్ నష్టపోయాయి. 223 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 185 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 101 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 స్టాక్ లాభపడగా.. 23 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్ 0.89 శాతం, అదానీ పోర్ట్స్ 0.82 శాతం, ఆసియన్ పెయింట్ 0.53 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.44 శాతం, ఎయిర్టెల్ 0.23 శాతం లాభపడ్డాయి.
Top Losers : టైటాన్ 2.17 శాతం, ట్రెంట్ 1.93 శాతం, ఐటీసీ 1.63 శాతం, ఎం అండ్ ఎం 1.62 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 1.61 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Lumino Industries IPO | భారీ లాభాలను అందించిన ఈపీసీ కంపెనీ.. 34 శాతం ప్రీమియంలో లిస్టయిన లూమినో ఇండస్ట్రీస్