Road Accident in Mosra | మోస్రాలో విషాదం.. వడ్లకుప్పను స్కూటీ ఢీకొని యువతి మృతి

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Road Accident in Mosra | మోస్రాలో విషాదం చోటుచేసుకుంది. వడ్లకుప్ప రూపంలో యువతిని మృత్యువు కబలించింది.

Road Accident in Mosra | రాత్రివేళ నిజామాబాద్​కు తిరిగి వస్తుండగా..

నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని నాందేవ్​వాడకు చెందిన యువతి దేవిరెడ్డి మోస్రాలో ఉన్న తన బంధువుల ఇంటికి సోదరితో కలిసి ఆదివారం ఉదయం వెళ్లింది. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో వీరు స్కూటీపై నిజామాబాద్​కు తిరిగి ప్రయాణమయ్యారు. అయితే మోస్రా శివారులో వడ్డకుప్పను వీరి స్కూటీ​ ఢీకొనగా వెనుక కూర్చున్న యువతి ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. దీనికి సంబంధించి వర్ని పోలీసులు (Varni Police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Congress Party Building | రేపు నగరంలో కాంగ్రెస్​ పార్టీ భవన నిర్మాణానికి భూమిపూజ..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *