Ashu Reddy Case | రూ. 9.35 కోట్ల మోసం కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి అషు రెడ్డి!

Shashi kiran Mottala

అక్షరటుడే, హైదరాబాద్: Ashu Reddy Case | బిగ్‌బాస్ ఫేమ్, నటి అషు రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పెళ్లి పేరుతో ఓ ప్రవాస భారతీయుడిని (NRI) భారీ మొత్తంలో మోసం చేశారనే ఆరోపణలపై ఆమెపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు (Hyderabad CCS Police) కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ అషు రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

Ashu Reddy Case | ఏమిటీ వివాదం?

హైదరాబాద్‌ (Hyderabad)లోని షేక్‌పేట్‌కు చెందిన ధర్మేంద్ర అనే యువకుడు లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అషు రెడ్డితో ఏర్పడిన పరిచయం కాస్తా పెళ్లి ప్రతిపాదన వరకు వెళ్లింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తన వద్ద నుంచి విడతల వారీగా సుమారు రూ. 9.35 కోట్లు వసూలు చేసి ఇప్పుడు మోసం చేశారని బాధితుడు ఆరోపించారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Ashu Reddy Case | ఏకపక్షంగా కేసు నమోదు :

పోలీసులు తన వెర్షన్ తీసుకోకుండానే ఏకపక్షంగా కేసు నమోదు చేశారని అషు రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి కేసులు పెట్టారని ఆమె వాదిస్తున్నారు. ఈ కేసును వెంటనే కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు (High Court) ఇచ్చే తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి..: Ashu Reddy Controversy | అషురెడ్డి వివాదం.. తండ్రి సంచలన వ్యాఖ్యలు, సంబంధాన్ని తిరస్కరించానని స్పష్టం

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *