Kerala Car Accident | లారీని ఢీకొన్న కారు.. 8 మంది విద్యార్థుల మృతి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది ఇంజినీరింగ్​ విద్యార్థులు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Car Accident | కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మంది ఇంజినీరింగ్​ విద్యార్థులు మృతి చెందారు.

మధ్య కేరళలోని త్రిసూర్ జిల్లాలో NH-66పై ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 11:40 గంటల ప్రాంతంలో కైపమంగళంలోని పనంబిక్కున్ను వద్ద ఈ ప్రమాదం జరిగింది. గురువాయూర్ నుండి కొడుంగల్లూర్ వైపు వెళ్తున్న కారు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టిందని పోలీసులు పేర్కొన్నారు. చనిపోయిన విద్యార్థులను తమిళనాడ (Tamil Nadu)లోని దిండిగల్​కు చెందిన వారిగా గుర్తించారు.

Kerala Car Accident | లారీ డ్రైవర్​ తప్పిదంతో..

నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లించిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద, హైవేకి కుడివైపున లారీని అక్రమంగా నిలిపి ఉంచారు. వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్​ను లారీని గమనించలేదు. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు లారీని ఢీకొనడంతో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారని పోలీసులు తెలిపారు. వారు కొడుంగల్లూర్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మృతులలో ఆరుగురిని గుర్తించారు. సూర్య, యువసంజిత్, విశ్వ, జోషువా దిండిగల్‌కు చెందినవారు కాగా, సంతోష్, ప్రసన్న మదురైకి చెందినవారు.

 

దీనిని కూడా చదవండి : Cabinet Expansion | తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై మళ్లీ నీలినీడలు.. ఆశావహులకు నిరాశేనా?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *