Bigg Boss Telugu 10 | బిగ్ బాస్ తెలుగు 10 గ్రాండ్ లాంచ్.. తొలి వారమే ‘మహాపరీక్ష’ అంటూ నాగార్జున సంచలన ప్రకటన

ఎలాంటి అంచనాలకు అందకుండా, సరికొత్త మలుపులతో ‘బిగ్ బాస్ తెలుగు 10’ సీజన్ ఘనంగా ప్రారంభమైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bigg Boss Telugu 10 | ఎలాంటి అంచనాలకు అందకుండా, సరికొత్త మలుపులతో ‘బిగ్ బాస్ తెలుగు 10’ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఈసారి షో మునుపెన్నడూ లేనివిధంగా సరికొత్తగా ఉంటుందని, ప్రతివారం ఒక డిఫరెంట్ అవతారంలో సరికొత్త సవాళ్లు ఎదురవుతాయని హోస్ట్ ‘కింగ్’ నాగార్జున వేదికపై స్పష్టం చేశారు.

Bigg Boss Telugu 10 | తొలి అవతారంగా ‘మహాపరీక్ష’..

ఈ సీజన్ మొదటి దశను వివరిస్తూ నాగార్జున ( Nagarjuna ) ‘మహాపరీక్ష’ అనే సరికొత్త కాన్సెప్ట్‌ను ప్రకటించారు. ప్రస్తుతం హౌస్‌లో ఎలాంటి హౌస్‌మేట్స్ లేరని, ఇప్పుడు పోటీపడుతున్న వారందరూ కేవలం కంటెస్టెంట్లు మాత్రమేనని తేల్చిచెప్పారు. బిగ్ బాస్ హౌస్‌లో వారి అసలు ప్రయాణం కఠినమైన పరీక్షలతోనే మొదలవుతుందని వెల్లడించారు.

Bigg Boss Telugu 10 | తాళం వేసిన బిగ్ బాస్ తలుపులు..

ఒక నాటకీయ పరిణామం మధ్య నాగార్జున బిగ్ బాస్ హౌస్ తలుపులకు తాళం వేశారు. “వచ్చే శనివారం కలుద్దాం.. అప్పటి వరకు మీ అందరికీ ఇదే మహాపరీక్ష” అని కంటెస్టెంట్లతో చెప్పి, ‘మహాపరీక్ష’తోనే బిగ్ బాస్ తెలుగు 10 దశావతార ప్రయాణం ప్రారంభమైనట్లు ప్రకటించారు. దీంతో ఈ మొదటి వారాన్ని అధికారికంగా ‘మహాపరీక్ష వారం’గా లాంచ్ చేసినట్టయింది. ఈసారి ఆట అత్యంత తీవ్రంగా, ఊహించని ట్విస్టులు , ఒత్తిడితో కూడిన టాస్క్‌లతో సాగనుందని స్పష్టమైంది.

Bigg Boss Telugu 10 | మొదలైన మ్యాజికల్ కీల పోరు..

పోటీదారులు ఇప్పటికే బరిలోకి దిగారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘మ్యాజికల్ కీలు’ దక్కించుకోవడానికి కంటెస్టెంట్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఈ తొలి వారం జరిగే టాస్క్‌లు, కైవసం చేసుకునే కీలే వారి బిగ్ బాస్ జర్నీని డిసైడ్ చేయనున్నాయి. హౌస్ తలుపులు మూసుకుపోవడం, మరోవైపు ‘మహాపరీక్ష’ నడుస్తుండటంతో బిగ్ బాస్ తెలుగు 10 అసలు సిసలైన ఆట ఇప్పుడే మొదలైంది.

ఇది కూడా చదవండి:  Wild Boar Accident | అడవి పంది అడ్డు రావడంతో.. కింద పడి ఒకరి మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *