అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sep 08 market Analysis | యూఎస్ US, ఇరాన్ Iran ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవడంతో ముడి చమురు(Crude oil) ధరలు బ్యారెల్‌కు వంద డాలర్లకు సమీపంలో కొనసాగుతున్నాయి.
పెరిగిన ముడిచమురు ధరలు స్థూల ఆర్థిక దృక్పథంపై ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు(Global markets) ఎక్కువగా నష్టాల బాటలో పయనిస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్ సైతం ప్రతికూలతంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Sep 08 market Analysis | యూఎస్ మార్కెట్లు..
కార్మిక దినోత్సవం కారణంగా గత సెషన్లో యూఎస్ స్టాక్ మార్కెట్‌కు సెలవు. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.63 శాతం నష్టంతో ఉంది.
Sep 08 market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.24 శాతం లాభంతో, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.23 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.13 నష్టంతో ముగిశాయి.
Sep 08 market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.89 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.26 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.23 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.08 శాతం లాభంతో, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.65 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.42 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.16 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 280 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు వరుసగా 20 వ సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 566 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.92 నుంచి 0.69 కు పెరిగింది.
- విక్స్ 4.49 శాతం పెరిగి వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 11.16 పైస బలపడి 94.49 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 97.13 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.75 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.78 వద్ద ఉన్నాయి.
- నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.