అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | అమెరికా -ఇరాన్ మధ్య వివాదం కొనసాగుతున్నప్పటికీ కొత్త దౌత్య ప్రయత్నాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్లనుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్‌లైన సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
Indian Stock Market | పడేసిన ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు..
అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలు కఠినంగా సాగుతున్నాయంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రతిష్టంభన దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. ‘ఒప్పందం కోసం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఇరుపక్షాలు ఒక స్థాయికి చేరుకున్నాయి. ఇక ఇచ్చిపుచ్చుకోవడాలు చాలాచాలా కష్టమవుతాయని భావిస్తున్నాం’ అని నిర్మలా సీతారామన్ పేర్కొనడంతో ఇంట్రాడే లాభాలు ఆవిరయ్యాయి.
Indian Stock Market | గ్యాప్ అప్ లో ప్రారంభం..
దేశీయ మార్కెట్లు (Domestic markets) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 289 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో 579 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 89 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 161 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 189 పాయింట్ల లాభంతో 72,099 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 22,474 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 19 స్టాక్స్ లాభాలతో, 11 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 3.41 శాతం, ఐటీసీ 1.87 శాతం, టీసీఎస్ 0.28 శాతం, ఎన్టీపీసీ 1.25 శాతం, ఎయిర్‌టెల్ 1.24 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్సీఎల్ టెక్ 3.11 శాతం, ఆసియన్ పెయింట్ 2.48 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.80 శాతం, ఇన్ఫోసిస్ 1.61 శాతం, బీఈఎల్ 0.87 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇదికూడా చదవండి: Oct 05 Gold Prices | బంగారం ధర తగ్గుతుందా?..పెరుగుతుందా?..అక్టోబరులో గోల్డ్ రేట్‌పై కీలక అంచనా