Free Police Training | ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్​ భవేష్​ మిశ్రా

పోలీసుశాఖలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్​ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Free Police Training | పోలీసుశాఖలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్​ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న ప్రీ రిక్రూట్ మెంట్ శిక్షణ శిబిరాన్ని సీపీ సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ బుధవారం సందర్శించారు.

Free Police Training | రెండునెలల పాటు..

కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) అభ్యర్థులకు సలహాలు, సూచనలు అందించారు. రీజనింగ్ ఎబిలిటీ, ఆంగ్లం, గణితం అంశాలలో ఎక్కువ మార్కులు సాధించడానికి పాటించాల్సిన పద్ధతుల గురించి మెలకువలు తెలియజేశారు. ఉద్యోగార్థులకు తానే స్వయంగా నైపుణ్య సామర్థ్య పరీక్షలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో ఏకాగ్రత, పట్టుదలతో ప్రణాళికాబద్దంగా కృషి చేస్తేనే కొలువు సాధించగల్గుతారని సూచించారు. పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య మాట్లాడుతూ హైదరాబాద్​లో అందించే కోచింగ్​కు ఏమాత్రం తక్కువ కాకుండా మరింత మెరుగైన మెటీరియల్​తో పాటు, నిష్ణాతులైన ఫ్యాకల్టీచే స్థానికంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించామని చెప్పారు. ప్రీ రిక్రూట్ మెంట్ ట్రైనింగ్ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ అన్ని విధాలుగా తోడ్పాటును అందించారని జిల్లా పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Free Police Training | ఏకాగ్రతతో చదవాలి

నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం అందించడం పోలీస్ శాఖ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. రెండు నెలల పాటు వినోదాలు, వేడుకలకు దూరంగా ఉండి, ఏకాగ్రతతో కృషి చేస్తే పోలీస్ శాఖలో చేరాలనే కలను సాకారం చేసుకోగలుగుతారని అన్నారు. ఉద్యోగార్థులకు భోజన వసతిని సమకూరుస్తూ రెండునెలల పాటు నిష్ణాతులచే థియరీ, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చాటేలా శిక్షణ అందిస్తున్నామన్నారు. హైదరాబాద్‌కు చెందిన భాగ్యకిరణ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, నిపుణులతో మెళకువలు నేర్పిస్తూ, అన్ని విధాలుగా సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకున్నారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, భాగ్యకిరణ్ ఇనిస్టిట్యూట్​ డైరెక్టర్ భాగ్య కిరణ్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Liberation Day | సెప్టెంబర్​ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలి..

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *