Naga Manikanta Comments | బిగ్‌బాస్ హౌస్ నుంచి అందుకే బయటకొచ్చాను.. అసలు కారణం చెప్పిన నాగ మణికంఠ

బిగ్‌బాస్ సీజన్-8లో తన ప్రయాణం మధ్యలోనే ఆగిపోవడానికి అసలు కారణం ఏంటో మాజీ కంటెస్టెంట్ నాగ మణికంఠ స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Naga Manikanta Comments | బిగ్‌బాస్ సీజన్-8లో తన ప్రయాణం మధ్యలోనే ఆగిపోవడానికి అసలు కారణం ఏంటో మాజీ కంటెస్టెంట్ నాగ మణికంఠ స్పష్టం చేశారు. జియోహాట్‌స్టార్‌లో  ( JioHotstar )నిర్వహించిన బిగ్‌బాస్ 24/7 లైవ్ చాట్ కార్యక్రమంలో ఆయన అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా హౌస్‌లో తన అనుభవాలు, ఆట తీరుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ లైవ్ చాట్ సమయంలో ఒక నెటిజన్.. “బ్రో, మీరు హౌస్ నుంచి ఎందుకు స్వయంగా బయటకు వచ్చారు?” అని ప్రశ్నించారు. దీనికి మణికంఠ బదులిస్తూ ఆరోజుల్లో తన మానసిక స్థితి అసలు బాగోలేదని తెలిపారు. ఆ పరిస్థితుల్లో తాను తీసుకున్న నిర్ణయమే సరైనదని భావిస్తున్నట్లు చెప్పారు.

Naga Manikanta Comments | విజేతగా నిలిచే వారికి..

అంతేకాకుండా, కేవలం తన వ్యక్తిగత కారణాలే కాకుండా.. హౌస్‌లో నిజంగా అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే ముందుకు వెళ్లాలని, విజేతగా నిలిచే సత్తా ఉన్నవారికి ఆ అవకాశం దక్కాలనే ఉద్దేశంతోనే తాను తప్పుకున్నట్లు మణికంఠ వివరించారు. జియోహాట్‌స్టార్ లైవ్ చాట్ వేదికగా మాజీ కంటెస్టెంట్లు తమ మనసులోని మాటలను, బిగ్‌బాస్ ప్రయాణంలోని అసలు నిజాలను అభిమానులతో పంచుకునే అవకాశం కలుగుతోంది.

ఇది కూడా చదవండి: Bhatti Vikramarka Comments | శుద్ధి చేయాల్సింది నేలను కాదు, మీ కులబుద్ధిని: భట్టి విక్రమార్క

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *