అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mayawati | బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ (BSP) బాధ్యతల నుంచి తప్పించారు.
మాయవతి ఇటీవల ఆకాశ్‌ను పార్టీ నుంచి తప్పించారు. ఆనంద్ మామగారైన అశోక్ సిద్ధార్థ్ రాజకీయాల నుంచి తప్పుకుంటే తిరిగి ఆనంద్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తామని బుధవారం చెప్పారు. దీంతో సిద్దార్థ్ అలాగే చేశారు. గురువారం ఉదయం ఒక భావోద్వేగ పోస్ట్ ద్వారా తన రాజకీయ జీవితానికి స్వస్తి పలికారు. అనంతరం మాయవతి ఆనంద్‌ను పార్టీ నుండి కూడా తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
Mayawati | కుటుంబ ప్రయోజనాలకే..
త్వరలో ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తన మేనల్లుడితో పాటు ఆయన మామను మాయవతి రాజకీయాలకు దూరం చేయడం గమనార్హం. ఆనంద్ పార్టీ విజయం కంటే తన కుటుంబ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మాయవతి అన్నారు. దీంతో ఆయన పార్టీకి సమర్థవంతంగా సేవ చేయగలరా అనే సందేహం కలుగుతోందని అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఆయన మామగారి నిర్ణయం ఆలస్యమైనప్పటికీ, అది “సరైన చర్య” అని అభివర్ణించారు.
Mayawati | నిన్ననే చేసి ఉంటే
తన అల్లుడు ఆనద్ భవిష్యత్తు పట్ల సిద్ధార్థ్‌కు కనీస శ్రద్ధ ఉన్నా, ఆయన నిన్ననే రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించేవారని మాయవతి అన్నారు. ఆలస్యం లేకుండా ఆ నిర్ణయం తీసుకుని ఉంటే, ఆనంద్ పార్టీలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. అలా జరగకపోవడంతోనే తన మేనల్లుడు ఆనంద్‌ను సైతం పార్టీ నుంచి తొలగించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Supreme Court Student Protest | సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన.. మేజిస్ట్రేట్ తీరుపై సీరియస్