అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Water Resources | జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి వనరులు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra)తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.
Nizamabad Water Resources | తక్కువగా నీటి నిల్వలు
వివిధ జలాశయాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వల గురించి ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే శ్రీరాంసాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో నీటి నిల్వలు తక్కువగా అందుబాటులో ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా చుక్క నీరు సైతం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి అవసరాలకు నీటిని నిలువ ఉంచుతూ, పంటలను కాపాడేందుకు వీలుగా రెండు తడుల వరకు సాగు నీటిని విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ జలాలు చివరి ఆయకట్టు వరకు చేరేలా గట్టి నిఘా ఉంచాలని, నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ నీటి నిల్వలు వృథా కాకుండా చూడాలని సూచించారు.
Nizamabad Water Resources | వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో..
వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అన్నారు. ఖరీఫ్ పంట సేకరణకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా గోడౌన్లలో నిలువ ఉన్న బియ్యం నిల్వలను నిర్దేశిత ప్రాంతాలకు వేగంగా తరలించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న బాలబాలికలకు ఏకరూప దుస్తులను త్వరితగతిన అందించాలని ఆదేశించారు. ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా రెవెన్యూ అధికారి గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Alprazolam Drug Case | డ్రగ్స్ అక్రమ రవాణాతో సంపాదించిన ఆస్తులు జప్తు..: సీపీ సాయిచైతన్య