Maharashtra Accident | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maharashtra Accident | మహారాష్ట్ర (Maharashtra)లోని భండారా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది మృతి చెందారు.

నాగ్‌పూర్-రాయ్‌పూర్ జాతీయ రహదారిపై ఉన్న పింపల్‌గావ్ రోడ్డు ప్రాంతంలోని ‘భావు ధాబా’ సమీపంలో ట్రక్​, వ్యాన్​ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Maharashtra Accident | బావు దాబా సమీపంలో..

భండారా జిల్లా లోని నాగ్‌పూర్-రాయ్‌పూర్ హైవేపై, పింపల్‌గావ్ సమీపంలోని ‘బావు ధాబా’ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, శబ్దం విని స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఛత్తీస్‌గఢ్ వాసులని సమాచారం. వారు రాయ్‌పూర్ నుండి నాగ్‌పూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న ధాటికి వాహనం ట్రక్కులో ఇరుక్కుపోయింది. రెండు జేసీబీల సాయంతో దానిని బయటకు తీశారు.

ఇది కూడా చదవండి..: BRICS Summit Delhi | రేపటి నుంచి బ్రిక్స్​ సదస్సు.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *