Indonesia Ship Missing | సముద్రంలో గల్లంతైన ఇండోనేషియా నౌక.. 102 మందిని రక్షించిన అధికారులు

ఇండోనేషియాకు చెందిన ఓ నౌక గల్లంతు అయింది. దీంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indonesia Ship Missing | ఇండోనేషియాకు (Indonesia) చెందిన ఓ నౌక గల్లంతు అయింది. దీంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ నౌకలో 240 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే అధికారులు నౌకను గుర్తించి.. ప్రయాణికులను కాపాడారు.

Indonesia Ship Missing | తూర్పు జావా నుంచి..

తూర్పు జావా నుండి దక్షిణ కాలిమంతన్ ప్రావిన్స్‌కు ప్రయాణిస్తున్న నౌక జావా సముద్రంలో(Java Sea Ship) ఉండగా.. అధికారులు దానితో సంబంధాలు కోల్పోయారు. దీంతో ఇండోనేషియా సహాయక బృందాలు ఆదివారం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఆదివారం తెల్లవారుజామున నౌకతో సంబంధాలు తెగిపోయినట్లు తమకు సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం పరిస్థితులు ఉన్నాయని, అంతకుముందు నౌక కెప్టెన్​ సమాచారం అందించాడు.

Indonesia Ship Missing | ఒకరి మృతి

నౌక చివరగా జావా సముద్రంలో బంజర్‌మాసిన్‌లోని ఒక రేవు నుండి సుమారు 148 కిలోమీటర్ల దూరంలో ఉంది. నౌకలో అందులో 241 మంది ప్రయాణికులు ఉన్నారు. దానిని నడుపుతున్న పీటీ వర్గో యోయెల్ రిహి సంస్థ, సంబంధాలు తెగిపోయినట్లు నివేదించింది. చివరగా నౌక ఉన్న ప్రాంతానికి ఒక సహాయక నౌకను పంపారు. 102 మంది ప్రయాణికులను కాపాడారు. ఒకరు మృతి చెందారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: AP Govt DA | ఉద్యోగులు, పింఛనుదారులకు రెండు డీఏలు.. బకాయిల చెల్లింపునకు షెడ్యూల్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *