Abhijit Deepke | శవాల మీద రాజకీయాలు చేయడానికి వచ్చారా?.. అభిజిత్ దీప్కేపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీరంగం

ధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధులతో గిరిజన పిల్లలు మృతి చెందిన ప్రాంతంలో పర్యటించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు తీవ్ర నిరసన ఎదురైంది.

Shivam nagarani

అక్షరటేడే వెబ్‌డెస్క్: Abhijit Deepke | మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధులతో గిరిజన పిల్లలు మృతి చెందిన ప్రాంతంలో పర్యటించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు తీవ్ర నిరసన ఎదురైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా చెప్పుకుంటున్న కొందరు వ్యక్తులు ఆయనను అడ్డుకుని నిలదీయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Abhijit Deepke | శవాల మీద రాజకీయాలా?

బాలాఘాట్ జిల్లాలోని అడోరి, కోర్కా, బొందారి గ్రామాల్లో అభిజిత్ దీప్కే పర్యటించి, వ్యాధుల బారిన పడి మృతి చెందిన గిరిజన చిన్నారుల కుటుంబాలను పరామర్శించారు. అలాగే స్థానిక వైద్య ఆరోగ్య సదుపాయాల గురించి ఆరా తీశారు. అయితే ఆయన అక్కడి నుంచి కారులో వెళ్తుండగా కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక్కసారిగా కారును చుట్టుముట్టారు.

ఈ క్రమంలో ఒక మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ మైక్ పట్టుకుని.. “మీరు ఇక్కడ శవాల మీద రాజకీయాలు చేయడానికి వచ్చారా? ఈ ప్రాంతానికి ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చారు?” అంటూ ప్రశ్నించింది. దీనికి దీప్కే తాను ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో మంచి రోడ్లు వేశామని, అవి మీకు కనిపించడం లేదా అంటూ ఆ మహిళ వాగ్వాదానికి దిగింది.

Abhijit Deepke | సురక్షితంగా తరలింపు..

పరిస్థితి మరింత ఉద్రిక్తమవడంతో అప్రమత్తమైన సీజేపీ కార్యకర్తలు అభిజిత్ దీప్కేను వెంటనే వేరే కారులోకి మార్చి అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఆయన వెళుతున్న సమయంలో ఆ గుంపు ‘పారిపోయారు, పారిపోయారు’ అంటూ నినాదాలు చేసింది. మారుమూల గ్రామానికి బయటి నుంచి ఇలాంటి సోషల్ మీడియా క్రియేటర్లు అకస్మాత్తుగా వచ్చి గొడవ చేయడంపై స్థానిక జర్నలిస్టులు విస్మయం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: Indonesia Ship Missing | సముద్రంలో గల్లంతైన ఇండోనేషియా నౌక.. 102 మందిని రక్షించిన అధికారులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *